వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రి నుంచి బాబా రామ్‌దేవ్ డిశ్చార్జీ, పోరాటం ఆగదని ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
డెహ్రాడూన్: డెహ్రాడూన్ ఆస్పత్రి నుంచి యోగా గురు రామ్‌దేవ్ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. నల్లధనానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన రామ్‌దేవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను డెహ్రాడూన్‌లోని హిమాలయన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన అక్కడ తన దీక్షను విరమించారు. అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని రామ్‌దేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అనంతరం చెప్పారు. దేశానికి నల్లధనాన్ని తేవాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.

ఢిల్లీలో తన నిరసన శాంతియుతంగా జరిగిందని, రాజ్యాంగాన్ని గానీ చట్టాలను గానీ ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. రామ్‌లీలా మైదానంలో తన అనుచరులపై పోలీసులు దౌర్జన్యానికి దిగడాన్ని ప్రస్తావిస్తూ పోలీసుల దౌర్జన్యం ఎప్పటికీ క్షమించరానిదని అన్నారు. తన ఆందోళనకు మద్దతిచ్చినవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరింత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రామ్‌దేవ్‌కు సూచించారు.

English summary
Baba Ramdev has vowed to continue his fight against corruption and black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X