రత్నాకర్‌ను విచారించిన పోలీసులు: పొంతన లేని సమాధానాలు!

రూ.35 లక్షలు ఎవరికి సంబంధించినది? ఎక్కడి నుంచి ఎక్కడికి పంపుతున్నారు?' అని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు రత్నాకర్ పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ నగదు 12 మంది వ్యక్తులకు సంబంధించినదని, తనకు సంబంధం లేదని అలాగే, బాబా మహా సమాధి నిర్మాణం కోసం ఆ డబ్బు సేకరించామని చెప్పినట్లు సమాచారం. కాగా పుట్టపర్తి నుంచి బెంగుళూరుకు అక్రమంగా రూ.35లక్షలు తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు హిందూపురం ఆదాయపు పన్ను శాఖాధికారి సదానందం శనివారం నోటీసులు జారీ చేశారు. కోర్టు అనుమతి తీసుకుని ఈ నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications