జగన్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?

తెలంగాణ నుంచి జగన్‌కు మద్దతుగా ముందుకు వచ్చిన శానససభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేగా కాంతారావు కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. అయితే, వైయస్ జగన్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య సీమాంధ్రలోనే ఎక్కువగా ఉంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత మూకుమ్మడిగా తాము రాజీనామాలు చేస్తామని గతంలో బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. కానీ, ఆ విషయంపై జగన్ తన వర్గం శాసనసభ్యులకు ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో రాజీనామాల అంశం మరుగున పడిపోయింది.
తెలంగాణ అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే అవకాశాలుంటాయని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వంటి నాయకులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుత స్థితిని ఆసరాగా తీసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నామనే పేరు చెప్పి జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పార్టీ ప్లీనరీకి శాసనసభ్యులను కూడా ఆహ్వానించామని అంబటి రాంబాబు సోమవారం చెప్పారు. వీరు రాజీనామాలు చేసి ప్లీనరీలో పాల్గొంటారా, రాజీనామాలు చేయకుండానే సమావేశానికి వెళ్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు కూడా రాజీనామా చేస్తే పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications