తగాదాలొద్దు: బస్సుయాత్రలో కెసిఆర్‌కు ఎర్రబెల్లి సూచన

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలకంటే ముందు రాజీనామా చేసింది తెలుగుదేశం పార్టీ నేతలమే అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఉప ఎన్నికలు తేవడం కాదని సంక్షోభం సృష్టించడమే అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ముందు రాజీనామా చేసి మిగిలిన పార్టీల నేతలు రాజీనామా చేయడానికి బాటలు పర్చిందని తద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమయిందన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని తెలంగాణ ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలి మంటతో ఉద్యమం చేస్తుంటే సీమాంధ్రులవి కడుపు నిండిన ఉద్యమాలని అన్నారు. తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలు ఉహసంహరించే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్రులు ఎవరైనా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టితే హైదరాబాదులో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications