కావూరిని మన్మోహన్ సింగ్ ఎందుకు పక్కన పెట్టారు?

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు ఈసారి మంత్రి పదవి తప్పకుండా దక్కుతుందని అందరూ భావించారు. కావూరి కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోరాదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనుకున్నట్లు చెబుతున్నారు. కావూరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా, వద్దన్నా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరంగా జరగాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కావూరి సాంబశివరావును మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడమే మంచిదని సోనియా భావించినట్లు తెలుస్తోంది.

కావూరి సాంబశివరావును మంత్రివర్గంలోకి తీసుకుంటే తెలంగాణ నేతల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తామంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నాయకులకు నాయకత్వం వహిస్తున్న కావూరిని తీసుకోవడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్లు భావించారు. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రివర్గంలో ఉన్నారు. అదే వర్గానికి చెందిన కావూరికి మంత్రి పదవి ఇస్తే ఇతర సామాజిక వర్గాలు నొచ్చుకునే ప్రమాదం ఉందని కూడా గ్రహించినట్లు చెబుతున్నారు.

పైగా, కిశోర్ చంద్రదేవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొదటి నుంచి ప్రధానితో పాటు సోనియా కూడా భావిస్తున్నారు. నిజానికి, ఆయనకు లోకసభ స్పీకర్ పదవి దక్కాల్సింది. స్పీకర్ పదవికి మీరా కుమార్‌ను ఎంపిక చేయడంతో ఆయనకు మంత్రి పవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, అప్పట్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సాయిప్రతాప్ పేరు సూచించడంతో కిశోర్ చంద్రదేవ్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు సాయిప్రతాప్ చేత రాజీనామా చేయించి, కిశోర్ చంద్రదేవ్‌కు స్థానం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+