హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన, కెసిఆర్ ధీమా

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: రెండు వారాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు కండువా వేసుకుని గురువారం కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల దీక్షా శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రెండు వారాల్లో తెలంగాణపై ప్రకటన వెలువడుతుందని తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందని ఆయన చెప్పారు. ధర్మమే గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాలను, దీక్షను ఆయన కొనియాడారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన అన్నారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లగడపాటి పేరు చెప్పకుండా తిట్ల వర్షం కురిపించారు. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ను అటెండర్ అంటాడా అని ప్రశ్నిస్తూ లగడపాటికి ఎంత కండకావరమని ఆయన అడిగారు. ఈ మాటలు పడడానికేనా కలిసి ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్టు గొప్పదని ఆయన అన్నారు.

English summary
TRS president J Chandrasekhar Rao expressed confident that Centre will come out with a statement on Telangana within two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X