సత్య సాయి బాబా స్థాపించిన శివంలో దొంగతనం

Theft in Sivam
హైదరాబాద్: నల్లకుంటలో ఉన్న శివంలో బుధవారం అర్దరాత్రి భారీ చోరీ జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెన్నై, ముంబయి, హైదరాబాదులలో సత్యం, శివం, సుందరం పేరిట ఆలయాలు నిర్మించిన విషయం తెలిసిందే. శివంను హైదరాబాదులో నిర్మించారు. రాష్ట్రంలో పుట్టపర్తి తర్వాత శివంకు ప్రాధాన్యత ఉంది. అలాంటి శివంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాచ్‌మెన్ ఉన్నప్పటికీ దొంగతనం జరగడం విశేషం. సత్య సాయి బాబా వెండి పాదుకలతో పాటు అర్చనకు సంబంధించిన హారతి పల్లెం తదితర వెండి వస్తువులు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. ట్రస్టు సభ్యులు ఉదయం వచ్చి చూసి దొంగతనం జరిగినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శివం కూతవేటు దూరంలో ఉంది. ఉస్మానియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు శివం పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+