వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూటర్‌పై బాంబును గుర్తించాం: ముంబై పేలుళ్లపై సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

RK Singh
న్యూఢిల్లీ: పేల్చడానికి వీలుగా స్కూటర్‌పై పెట్టిన బాంబును గుర్తించినట్లు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్ చెప్పారు. ముంబై పేలుళ్ల సందర్భంగా బుధవారం పేల్చడానికి స్కూటర్‌పై పెట్టిన బాంబును దర్యాప్తు అధికారులు గుర్తించారని ఆయన అన్నారు. పేలుళ్లు సంభవించి రెండు రోజులవుతున్నా దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు సరైన సాక్ష్యాలను సేకరించలేకపోయారు. పేలుళ్లకు సంబంధించి లభించిన కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నట్లు సింగ్ తెలిపారు.

స్థానికుల సహాయంతో సిసిటివి రికార్డింగులో కనిపిస్తున్న అందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిసిటివి రికార్డింగ్ ద్వారా కీలకమైన ఆధారాలు లభించగలవని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రికార్డింగులో అనుమానాస్పదంగా కనిపించేవారందరినీ ప్రశ్నించనున్నట్లు ఆయన తెలిపారు. దేశం వెలుపలి ఇ- మెయిల్ వచ్చిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఆ మెయిల్ గురించి గానీ అది ఎక్కడి నుంచి వచ్చిందనేది గానీ ఆయన చెప్పలేదు.

English summary
The investigators have identified a scooter on which one of the bombs was planted to trigger the Wednesday terror strikes in Mumbai, according to Union home secretary RK Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X