నెల్లూరు: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి17 రాకెట్‌ను ప్రయోగించింది. నాలుగు దశల్లో ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. జీశాట్-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్ చేపట్టింది. రాకెట్ ప్రయోగానికి ముందు బుధవారం మధ్యాహ్నం 12.18 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ఇది 200 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వాడుకుంటారు.
Scientists at the Indian Space Research Organisation (ISRO) in Sriharikota have launched a new communications satellite using the smaller of their rockets, the Polar Satellite Launch Vehicle (PSLV).
Story first published: Friday, July 15, 2011, 17:39 [IST]