లగడపాటిపై విరుచుకుపడిన వైయస్ జగన్ వర్గం

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆ పార్టీ నాయకులు, ఆయన వర్గం నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా, నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుటి కుటుంబ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టి లగడపాటి లబ్దిపొందాలని చూస్తున్నారని సబ్బం హరి విమర్శించారు.

లగడపాటి వైఎస్ కుటుంబ విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిదన్నారు. ఆ విషయాలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ గానీ చెబితే నమ్ముతారన్నారు. లగడపాటి చెబితే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవరూలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలలో ఒకరైన జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా ఆ నాడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఇక పనికిరాదని చెప్పి ఇందిరా కాంగ్రెస్ అనే కొత్తపార్టీని పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేయని పనులను చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఇతర పత్రికలు వార్తలు రాస్తే స్పందించని లగడపాటి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎవరికి బుద్ది చెబుతారో ఆ రోజు కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానన్నారు. ఆ రోజు 2014కు ముందే రావాలని తాను కోరుకుంటున్నట్లు హరి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+