నిద్ర కరవవుతున్న బొత్స, ముఖ్యమంత్రి

botsa satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయానికే రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు వరుసగా తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన వేరు కుంపటిని పెట్టుకుని తన వర్గ ఎమ్మెల్యేలతో పెరేడ్ చేయించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి తనకు లేదని తనంత తానుగా జగనే బాహిరంగంగా అంగీకరించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాక అంతా సవ్యంగానే నడుస్తుందని కాంగ్రెస్ నేతలందరూ ఆశించారు. అలా పార్టీలో పరిస్థితులు చక్కబడుతున్న సమయంలో పిసిసి అధ్యక్ష పదవిలో బొత్ససత్యనారాయణను అధిష్ఠానం నియమించింది.

వాస్తవానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్ర వాదన గట్టిగా వినిపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారికే ఈ పీఠాన్ని అప్పగిస్తారని అందరూ భావించారు. కాని అధిష్ఠానం ముందు నుంచి సంకేతాలు పంపుతున్నట్లుగానే పిసిసి చీఫ్ పదవిని సత్తిబాబుకు అప్పగించింది. పిసిసి అధ్యక్షుడిగా సత్తిబాబును సీమాంధ్రనేతలు ఎంత బలపరిచారో అంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతు పలికారు.

సీమాంధ్ర ప్రాంత నేతలెవరకీ లేని విధంగా మెదక్ జిల్లా పర్యటనలో సత్తిబాబుకు బ్రహ్మరథం పట్టారు. పరిస్థితిలో మార్పు వస్తోందని కాంగ్రెస్ నేతల్లో మళ్లీ భరోసా వచ్చిందని అందరూ భావించారు. పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స జూన్ నెలాఖరు నుంచి జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలను జరపాలని నిర్ణయించారు. కానీ ఈ నెల మొదటి తేదీ నుంచే రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. మొత్తానికి బొత్సకు, కిరణ్‌కు పదవిలో కూర్చున్నామన్న మాటే గానీ ఎప్పుడు తెలంగాణ, జగన్ సమస్యలను తీర్చలేక వారి తల ప్రాణం తోకకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+