ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చునని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అన్నారు. కార్యకర్తలు అంతా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో ఊహించని రాజకీయ పరిస్థితులు ఎదురవుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే అన్నారు. కొత్తగా వచ్చిన పార్టీలు కాంగ్రెసుతో లాలూచి పడతాయని ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. తాను సొంత కుటుంబం కంటే పార్యీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ పూర్తి అవినీతిలో కూరుకు పోయిందన్నారు. అవినీతిని రూపు మాపడానికి అన్నాహజారే వంటి వారు ముందుకు వచ్చారన్నారు. కేంద్రం అవినీతిపై స్పందించే పరిస్థితిలో లేదన్నారు. ఆర్థిక ఫలాలు పేదలకు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ చెప్పాల్సింది చెప్పిందని నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+