తెలంగాణలో కాంగ్రెసు గల్లంతే: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణను ప్రకటించకుంటే తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం తప్పదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ బుధవారం కరీంనగర్‌లో అన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెసు చేపట్టిన సత్యాగ్రహ దీక్షను కరీంనగర్‌లో పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐక్యతతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని చెప్పారు. డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం చేసిన ప్రకటన తప్పునుకుంటే ఇప్పటి వరకు ఎందుకు సవరించలేదని ఆయన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలి లేదా రాజీనామాలు ఆమోదించాలని సూచించారు. తెలంగాణ ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదన్నారు.

తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల మాటలు నమ్మొద్దని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలోని దామరచెర్లలో సత్యాగ్రహ దీక్షలు ప్రారంభించుతూ అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాదు రానివ్వమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రాజీనామాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఎవరూ వెనక్కి తగ్గిన ద్రోహులుగా మిగిలి పోతారని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+