శ్రీవారి సన్నిధిలో సెల్ ఫోన్ల వాడకం నిషేధం...

Cell Phone Usage Ban in Tirumala
తిరుపతి: ఏడుకొండల వాడి సన్నధిలో సెల్ ఫోన్లు ఉపయోగించకూడదంటూ తిరుమల భద్రతాధికారులు నిషేధాజ్ఞలు విడుదల చేశారు. ఆలయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరైనా కనిపిస్తే.. వారి సెల్ ను స్వాధీనం చేసుకోవల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. తిరుమల సందర్శించే భక్తులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి ఫోన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపధ్యంలో తిరుమల ఆలయానికి రక్షణ చర్యలు పటిష్టం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భద్రతాధికారి ఎమ్.కె.సింగ్ తెలిపారు. అయితే కొద్ది రోజులు క్రితం డీజీపీ దినేష్ రెడ్డి తిరుమల ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెల్సిందే. పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ రక్షణ చర్యలకు సంబంధించి మరిన్ని సూచనలు చేసినట్లు సమచారం. అందులో భాగంగానే సెల్ ఫోన్ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+