హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్కలు చింపిన విస్తరిగా మారిన రాష్ట్ర రాజకీయాలు!

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం ఖచ్చితమైన పరిష్కారం సూచించాలి. అదేదో తేల్చుకున్నాకే తిరిగిరండి. అధిష్టానం వద్ద రాజీపడి వెనక్కు రావద్దు. ఇక్కడికొచ్చి, ఒకరిపై ఒకరు మళ్ళీ మీసాలు తిప్పొద్దు. అలా చేయటానికి ప్రయత్నిస్తే ఈ సారి మీసాలు గొరిగేస్తారు అంటూ ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ అంశంతో రాష్ట్ర రాజకీయ వ్యవస్ధ కుక్కలు చించిన విస్తరిలా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పును ఇప్పుడు గుర్తించినట్లు చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఆజాద్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించలేదని ఆయనే వక్రబుద్ధితో మాట్లాడారని ధ్వజమెత్తారు. షరతులతో కూడిన ఒప్పందం మేరకే 1954లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలనే ఆనాడు పదవులు, బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగుల నిష్పత్తి, మంత్రి పదవులు, అభివృధ్ధి మండలి ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పాలకులు వాటిని విస్మరించటంతోనే సమస్య పెద్దదైందని చెప్పారు.

ఓవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూంటే వాటిని ఆర్పే ప్రయత్నం చేయకుండా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంభకోణాల్లో కూరుకుపోయాయి. సాక్ష్యాధారాలతో సహా నిరూపించటానికి సిద్ధంగా వున్నా. ఒకవేళ నిరూపించలేకపోతే ఉరేసుకుని చస్తా. ఈ సవాల్ కు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు సిధ్ధమేనా ? అని కూడా నారాయణ సవాల్ విసిరారు.

English summary
Congress leaders in the State who had gone to Delhi should finalise the issue of telangana with Congress high command return to the State. Otherwise people will insult them. Both Centre and State deeply involved in various schemes. I will prove them with evidences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X