ఎపి భవన్ ఉద్యోగులపై హరీష్ రావు దాడి, ఉద్రిక్తం

Harish Rao
న్యూఢిల్లీ: ఎపి భవన్ ఉద్యోగులపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు హరీష్ రావు గురువారం దాడి చేశారు. బుధవారం పార్లమెంటు సమీపంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు వస్తామని చెప్పి దొంగచాటుగా విమానాశ్రయానికి తరలించడంతో ఆగ్రహం చెందిన హరీష్ రావు ఎపి భవన్‌లోకి కోపంగా వెళ్లారు. తలుపులను తన్నేసి లోనికి వెళ్లి లోపల ఉన్న ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాము కేవలం ఉద్యోగులమేనని తమపై ప్రజాప్రతిధులు దాడులు చేయడమేమిటని వారు ధర్నాకు దిగారు. అధికారులు చెప్పినట్లు చేయడమే తమ పని అని చెప్పారు.

మాకు ప్రజాప్రతినిధులు అందరూ సమానమే అన్నారు. దళిత ఉద్యోగిపై చేయి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇతర దేశాలలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తామని అలాగే ఈ మృతదేహాన్ని తరలించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే మేం తరలించామని అన్నారు. పై అధికారులు చెప్పినట్లు చేయకుంటే తమ ఉద్యోగాలు పోతాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+