వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలతో పెరుగుతున్న నీటి ఉధృతి..

|
Google Oneindia TeluguNews

Floods
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నుదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పాలు ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగటంతో వరద నీరు ఊళ్లను మంచుతున్నాయి. నీటిలో చిక్కుకుని పలువురు ప్రాణాలు కోల్పొతుంటే..మరి కొన్ని కటుంబాలు నానా యాతన అనుభవిస్తున్నాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరధ ఉధృతికి పలు గ్రామాలు నీట మునిగాయి. ఒక వైపు భారీగా వర్షం కురుస్తున్నా లెక్క చేయని నలుగరు కుర్రాళ్లు వాగు వద్దకు వెళ్లారు... ఆ సమయంలో వాగులో నీరు లేకపో్వటంతో మధ్యలోకి వేళ్లారు.. అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటంతో వరదనీరు వాగులోకి చొచ్చకు వచ్చింది. కంగారులో.. ఎటుపోవాలో తెలియక వీరు ఆ వాగు మధ్యలోనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు అతికష్టం మీద వీరిని వడ్డుకు తీసుకురావల్సి వచ్చింది.

మేనమామతో కలిసి వాగుకు వెళ్లిన బనవాసీ అనే బాలుడు వరద నీటిలో చిక్కుకుపోయాడు. ఉత్కంఠకు తెరతీసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని దిండోరా జిల్లాలో చోటుచేసుకుంది. వరద తాకిడికి ఆ బాలుడి మేనమమ కొట్టుకుపోవటంతో ఈ బుడతడు మాత్రం వరద నీటిలో చిక్కుకుని ఒక రాయి పై నించోని ఉన్నాడు. వాడిని రక్షించిటానికి నానా యాతన పడిన స్థానికులు యట్టలకేలకు ఆ చిన్నోడ్ని రక్షించారు.

ఇండోర్ సమీపంలోని ఓ వాగు ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం వరద ఉధృతికి బలైంది. నీరులేని సమయంలో వాగులోకి దిగిన 5గురి సభ్యుల కటుంబం ఒక్క సారిగా నీరు రావటంతో ఎక్కడి వారు అక్కడే నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. కాసేపు వారు అక్కడే నిలబడి ఉంటే ఎలాగోలా బయటకు వచ్చే అవకాశం ఉండేది.. కానీ అందులో ఒకరు కాలు జారీ పడిపోవటంతో ఒకరిని పట్టుకోవటం కోసం మరొకరు జరుగుతూ నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు బతికి బట్టకట్టగా మరో ఇద్దరు మృతి చెందారు.. మరొకరు గల్లంతయ్యారు.

వరదలు నేపధ్యంలో కాశ్మీర్ లోని సాంబ జిల్లాలో మరో ఉదంతం చోటు చేసుకుంది. వాగులో ఇసుకు తవ్వేందుకు వెళ్లిన నలుగురు కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు వేసుకొచ్చిన లారీ కూడా వాగులో ఇరుక్కుపోయింది. ఇద్దరు లారీ పై ఉంటే.. మరో ఇద్దరు నీటిలో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు అతికష్టం మీద వారికి ఒడ్డుకు చేర్చారు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ మహావృక్షం విరిగిపోవడంతో దాని కింద పడి తల్లి, కూతుళ్లు మరణించారు. పలు కార్లు ధ్వంసమయ్యాయి. నారిమన్ పాయింట్ దగ్గరున్న రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది.

English summary
Flood-Related incidents in Madhya Pradesh and Jammu and Kashmir even as the situation became cruel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X