తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ

Andhra Pradesh
హైదరాబాద్ : తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరందుకుంటున్నాయి. నేతలు ఒకరిపై మరి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చావులు, హత్యలు, ఆత్మాహుతులు, మొదలైన రక్త చరిత్ర పునరావృతమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ప్రత్యేకించి తాజాగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ 'మా దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం. కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు దిగుతాం" అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు, కరీం నగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నాల ప్రభాకర్ సీమాంధ్రులు కీర్తి శేషులుగా మిగులుతారనటం మొదలగు అంశాలు, ఇరు ప్రాంతాల నేతల్లోను కలవరాన్ని కలిగిస్తున్నాయి.

సీమాంధ్రనేతల అసలు రంగు బయటపడిందని, వారు రక్తం రుచి మరిగిన పులులని మండిపడటం, తెలంగాణకు అడ్డుపడితే, వ్యాపార ప్రయోజనాలను అడ్డుకుంటామని తెలంగాణ నాయకులు అనటం జరిగింది. ఇదే సమయంలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ వంటి నేతలు, రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో పదజాలాన్ని మార్చాల్సిన అవసరం వుందని, ప్రజాప్రతినిదులు తమ ప్రసంగాలలో భాష మార్చాలని సూచనలు ఇవ్వటంతో రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన ఇరు ప్రాంతాలకు ఏ మాత్రం ప్రయోజనం వుండదని గ్రహించిన నేతలు పరిస్ధితిని చక్కదిద్దటానికి నడుం కట్టారు.
ఈ సందర్భంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కొందరు ఈరోజు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు జేసీ దివాకర రెడ్డి, ఎమ్మల్సీలు యాదవరెడ్డి, అమోస్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. తాజా పరిణామాలపై చర్చించిన నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు సబబుకాదని అభిప్రాయపడ్డారు.

అయితే, ప్రత్యర్ధి వర్గాలు సంచలనం కలిగించే వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు దిగుతూంటే, తాము ఏమీ పట్టనంటూ కూర్చొనటం కూడా సబబు కాదని ఈ నేతలు అబిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనప్పటికి, ఇదే రకమైన సమావేశాలు వివిధ నేతల స్ధాయిలలోను, పార్టీల స్దాయిలలోను జరిగి రాజకీయనాయకుల భాషలో కొన్ని నిబంధనలు ఏర్పడి, పరిస్ధితి చక్కబడితే ఉద్యమ తీవ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+