తరిమి తరిమి కొడతాం: నిప్పులు చెరిగిన రేవంత్

Payyavula Keshav and Revanth Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం సీమాంద్ర ప్రజాప్రతినిధులపై నిప్పులు చెరిగారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడతామన్న తమ పార్టీ సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్‌ను తీవ్రంగా విమర్శించారు. సీమాంధ్రులను తరిమి కొట్టడం తమకు పెద్ద పని కాదన్నారు. రజకార్లపై పోరాటం చేసిన మాదిరి సీమాంధ్రులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేం తిరగబడితే సీమాంధ్రులు ఆత్మాహుతి దాడులు కాదు ఆత్మహత్యలు చేసుకోవాలని హెచ్చరించారు.

నాయకుల కంటే తెలంగాణ ప్రజలే తెలంగాణ ఎక్కువగా కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరుకుంటున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే పెద్ద దుర్మార్గులని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు పెన్ను పట్టుకోవడమే కాదు గన్ను పట్టుకోవటమూ తెలుసన్నారు. సీమాంధ్రులు హెచ్చరించే వ్యాఖ్యలు తగ్గించాలన్నారు. సేనలను తయారు చేస్తానని టిజి వెంకటేష్, లగడపాటి వంటి వారు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సమైక్యవాదం వినిపించే నేతలను సభలకు రాకుండా తరిమి తరిమి కొడతామన్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం తెలంగాణను బలి చేస్తున్నారని అన్నారు. తన రాజీనామా స్పీకర్ ఫార్మెట్‌లో లేదని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉంటామన్న సీమాంధ్రులు మొహం మీద ఉమ్మెస్తేనైనా వెళతారా అని ప్రశ్నించారు. ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని ఇప్పటికీ అర్థం కాకుంటే వారికి అర్థమయ్యే భాషలో చెబుతామని హెచ్చరించారు. మా పాత చెప్పులు మోయడానికి ఇక్కడే ఉంటారా అని ప్రశ్నించారు. సీమాంధ్రుల వల్ల రాష్ట్రం కలుషితం అయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+