హైదరాబాద్: సమ్మెలు, ఆందోళనల వలన తెలంగాణ రాదని ఎంపీ హర్షకుమార్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాలు తమ ఆలోచన మార్చుకోవాలని ఆయన సూచించారు. బంధ్ ల వలన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదనీ, తెలంగాణ సాధనకోసం ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని ఎంపీ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన హర్షకుమార్ వివిద అంశాలపై ఆయనతో చర్చించారు. కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే మార్గానికి 50 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి చెప్పారని హర్షకుమార్ తెలిపారు.
Strikes by employees, agitations, bandh, etc. will not yield any result. moreover this type of activities will cause lot of inconvenience to the common people and make their lives deplorable.