దయ చేసి హింసను ప్రేరేపించే ప్రసంగాలు వద్దు: జయప్రకాష్
State
oi-Nageswara Sharma
By B N Sharma
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతున్న భాష, చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉంటున్నాయని లోక్ సత్తా అద్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు, విధ్వంసకారుల్ని తలదన్నేలా నాయకులు మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడుతున్న వారిని తక్షణం విచారించి జైలులో పెట్టాలన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి వున్నా ప్రజల చేత ఎన్నికైన నేతలు అలా నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదని ఆయన అన్నారు.
Leaders belonging to different political parties are using the provocative language and are encouraging the violence in the State. Whether the State is bifurcated or not it is not proper for the political leaders to use such language.