వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగాల పందేరం: ముసాయిదాకు సిఎం ఆదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాజీవ్ విద్యా మిషన్ ద్వారా వచ్చే మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. మంగళవారంలోగా సమగ్ర ముసాయిదా తనకు ఇవ్వాలని ఆయన వారిని ఆదేశించారు. కాగా ఇటీవలె రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల రూపకల్పన చేస్తామని చిత్తూరు జిల్లాలోని ఓ బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు సంవత్సరానికి ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు.

ఆ కార్యక్రమాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసిన రెండు రోజులలోనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఉద్యోగ కల్పనకు సంబంధించిన ముసాయిదా తయారు చేయాలని అధికారులను అదేశించారు. చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలను ముగించుకొని ముఖ్యమంత్రి ఉదయమే హైదరాబాదు చేరుకున్నారు. ఆయన రాగానే దీనిపై దృష్టి సారించడం విశేషం.

English summary
CM Kiran Kumar Reddy ordered officers to prepare Rajiv Vidya Mission draft. He ordered them to give this report on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X