2జి స్కామ్: రాజా వ్యాఖ్యలతో కాంగ్రెసుకు చిక్కులు

కాగా, రాజా ప్రకటనను భారతీయ జనతా పార్టీ (బిజెపి) యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి ఆయుధంగా వాడుకుంటోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మన్మోహన్ సింగ్, చిదంబరం కూడా ఉన్నారని బిజెపి జాతీయాధ్యక్షుడు నితన్ గడ్కరీ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాని పాత్రపై సాక్ష్యాధారాలు దొరికాయని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్, చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంబకోణం రాజాకే పరిమితం కాదని ఆయన అన్నారు. 2జి స్కామ్‌లో అందరికీ భాగం ఉందని రాజానే అంగీకరించారని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే హక్కు యుపిఎకు లేదని ఆయన అన్నారు.
యూనిటెక్, స్వాన్‌లపై చిదంబరం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాజా లేఖలపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications