చిరంజీవి విలీనం ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెసు

వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడి కొత్త కుంపటి పెట్టుకున్న తర్వాత ఆయన పార్టీ ఆవిర్భావ సభ కన్నా ఘనంగా విలీన సభను నిర్వహించాలని కాంగ్రెసు వర్గాలు కూడా భావించాయి. కానీ ఇప్పుడు కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాత్రం విలీనాన్ని సాదాసీదాగా నిర్వహించాలని చావు కబురు చల్లగా చిరంజీవి దృష్టికి తెచ్చినట్లు కనిపిస్తోంది. చిరంజీవికి ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని సాదాసీదాగా ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అలాగే శాసనసభ్యులు హైదరాబాదులోని గాంధీ భావనంలో, జిల్లా స్థాయి నేతలు డిసిసి కార్యాలయాల్లో కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications