గడువు అడిగిన ఆజాద్, లేదన్న తెలంగాణ ఎంపీలు

మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని బలరాంనాయక్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకే తన మొదటి ప్రాధాన్యం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని, మన్యసీమ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. నదీజలాలు, హైదరాబాదు సమస్యలు మాత్రమే ఆటంకాలుగా ఉన్నాయని, వాటిపై చర్చలు జరిగి సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తమను ఆజాద్ ఢిల్లీకి పిలిచిన మాట వాస్తవమేనని, అయితే రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని అడగలేదని ఆయన చెప్పారు. సోమవారం మరోసారి ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆజాద్‌తో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications