టి-కాంగ్రెసుపై ఆజాద్ ఒత్తిడి: నో అంటున్న నేతలు

ప్రస్థుత పరిస్థితుల్లో రాజీనామాలు ఉపసంహరించుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలపై ఆలోచిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ప్రకటన చేయకుండా వెనక్కి వెళ్లం అని ఆజాద్‌తో తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అయితే అధిష్టానంతో చర్చలకు రమ్మని ఆజాద్ పిలవడంతో అందుకు ఆయన సమ్మతించినట్లుగా తెలుస్తోంది. అధిష్టానంతో చర్చలకు వెళ్లేందుకు టి-కాంగ్రెసు ఎంపీలు మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ భేటీలో స్పీకరు రాజీనామాలు తిరస్కరిస్తే పార్లమెంటులో పోరాటం చేయాలని ఎంపీలు నిర్ణయించుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications