సత్యం రామలింగరాజుకు బెయిలు ఇక ఈజీ?

అయితే జూలై 31 2011వ తేదిలోగా సిబిఐ తన విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ లోపు సిబిఐ విచారణ పూర్తి చేయలేక పోతే బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టు తెలిపింది. దీంతో రామలింగరాజుతో పాటు ఆయన టీంకు కూడా బెయిలు వచ్చే అవకాశాలు సులభతరం అయ్యాయని తెలుస్తోంది. సిబిఐ విచారణ తేది ఆదివారంతో ముగియనుంది. ఈ కారణంగా ఆయన బెయిలుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే సిబిఐ కూడా బెయిలుపై కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు 224 మందిని సిబిఐ విచారించింది.












Click it and Unblock the Notifications