అమరజీవిని చంపింది ఆంధ్రావాళ్లే: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రం ప్రకటించిన తర్వాత మద్రాసు పట్టణంకోసం దీక్షను కొనసాగింపజేసి అమరజీవి పొట్టి శ్రీరాములు చనిపోవడానికి ఆంధ్రావాళ్లే కారణమయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు సోమవారం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 11రోజులు దీక్ష చేయడంతోనే నెహ్రూ స్పందించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. అయినా మద్రాసు పట్టణం కావాలని మొండికిపోయి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని చంపారని విమర్శించారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, జీవితాన్ని విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు.

సీమాంధ్రలో తెలుగుతల్లి విగ్రహాలను ఎందుకు పెట్టలేదు? తెలంగాణలోనే ఎందుకు పెడ్తరు? అని ప్రశ్నించారు. తెలంగాణకోసం రాజకీయ బెటాలియన్ అంతా ఏకమైతే సీమాంధ్రులు అదిరిపోయి, బెదిరిపోయి చీల్చడానికి కుట్ర చేస్తున్నారని కెసిఆర్ విమర్శించారు. పదవుల్లో కొనసాగాలా, వద్దా అని నిర్ణయించుకునే హక్కు ప్రజాప్రతినిధికే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభ, 9న మహిళా సదస్సు, 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బహిరంగసభను నిర్వహించనున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+