లొంగిపోయిన పరిటాల ముఖ్య అనుచరుడు

Anantapur District
హైదరాబాద్: దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) దినేష్ రెడ్డి ముందు లొంగిపోయాడు. చమన్ పలు హత్య కేసులలో నిందితుడు. హైదరాబాదులోనూ పలు భూకబ్జా కేసుల్లో నిందితుడు. మూడు భూకబ్జా కేసులలో ఆయనకు పోలీసులు వారెంట్లు జారీ చేశారు. 2004 ఎన్నికల సమయంలో నాగసముద్రం వద్ద కాంగ్రెసు ఏజెంటు గంగాధర్‌పై దాడి చేసిన కేసులోనూ చమన్ నిందితుడు. చమన్ రెండు రోజుల క్రితమే అనంతపురం పోలీసులను కలిసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతే హైదరాబాదు వచ్చి డిజిపి దినేష్ రెడ్డి ముందు లొంగిపోయారు. పరిటాల రవితో చమన్‌ది ముప్పయ్యేళ్ల పరిచయం. ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు.

2005లో పరిటాల రవి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఏడేళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇటీవలే హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి ఇంట్లో టివి బాంబు కేసులో ప్రధాన నిందితుడు. ఆర్వోసీ ముఖ్యనేతగా పని చేశాడు. లొంగిపోయిన అనంతరం చమన్ మాట్లాడారు. ప్రశాంతంగా బ్రతకాలనే తాను లొంగిపోయినట్లు చెప్పారు. తనకు ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం లేదని, ఎప్పుడూ దానికి దూరంగానే ఉన్నానని చెప్పాడు. చమన్‌ సొంత గ్రామం అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం కొత్తపల్లి గ్రామం. కాగా పరిటాల రవి మరో అనుచరుడు పోతుల సురేష్ గతంలో లొంగిపోయారు. లొంగుబాటు అనంతరం చమన్‌ను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

చమన్ లొంగుబాటు సమయంలో డిజిపి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యాక్షం రాజకీయాన్ని రూపుమాపాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్షన్ నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలలో మగ్గుతున్న వారు రాష్ట్రంలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా లొంగి పోవచ్చునని సూచించారు. లొంగుబాటు అేది చట్టపరమైన ప్రక్రియ అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+