తిరుపతి ప్రజలపై అలిగి హైదరాబాద్ వచ్చేసిన చిరు

గతంలోనూ మహిళలు చిరంజీవిని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తారని ఓటు వేసి గెలిపిస్తే నిత్యం చెన్నై, హైదరాబాదుకు పరిమితమవుతున్నారని వారు ఆరోపించారు. అ తర్వాత సైతం ఆయన పర్యటన జరిగినప్పటికీ తీవ్ర అసంతృప్తితోనే జరిపినట్లు తెలుస్తోంది. పలు రోడ్డు పనులకు, మరిన్ని అభివృద్ధి పనులకు సోమవారం శంఖుస్థాపన చేశారు. అనంతరం రాత్రికి రాత్రే చెన్నై మీదుగా హైదరాబాదు చేరుకున్నారు. అయితే మంగళవారం సైతం ఆయన పర్యటన తిరుపతిలో ఉంది. మంగళవారం రుయా ఆసుపత్రిలో రోగులను పరామర్శించడం, హాస్పిటల్ సిబ్బందితో భేటీ ఉంది. ఆ తర్వాత తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ జాంపై జెసి, తదితరులతో సమావేశం ఉంది.
అయితే వీటన్నింటినీ రద్దు చేసుకొని ఆయన చెన్నై ఫ్లైట్ ఎక్కేశారు. చిరంజీవి పర్యటన రద్దవుతున్నట్లు మంగళవారం ఉదయం వరకు కనీసం ప్రజారాజ్యం పార్టీ నాయకులకు సైతం తెలియదని సమాచారం. రాత్రి తాను వెళ్లే సమయంలో ఒక ముఖ్య నేతకు ఫోన్ చేసి మంగళవారం కార్యక్రమాలన్నింటిని రద్దు చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి పర్యటన రద్దు విషయం తెలియని పిఆర్పీ కార్యకర్తలు మంగళవారం నాటి పర్యటనకు పూర్తిగా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. చిరు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్లాడని తెలుసుకొని వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications