విభజన తేనెతుట్టెను కదిలించిన జైపాల్ రెడ్డి

S Jaipal Reddy
న్యూఢిల్లీ: ఇప్పుడు చర్చలు జరగాల్సింది రాష్ట్ర విభజన మీద మాత్రమేనని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో తెగేసి చెప్పారు. సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీరు ముఖ్యమంత్రి అయితే తాము అంగీకరిస్తామని, రాష్ట్ర విభజనకు మాత్రం అంగీకరించబోమని సీమాంధ్ర నాయకులు జైపాల్ రెడ్డితో అన్నారు. దాంతో పరిస్థితి ఇప్పుడు అలా లేదని, విభజన జరగడం తప్ప మరో మార్గం లేదని, ప్రధానికి కూడా తాను ఇదే విషయం చెప్పానని జైపాల్ రెడ్డి వారితో అన్నారు. తద్వారా జైపాల్ రెడ్డి తెలంగాణ తేనెతుట్టెను కదిలించారని అంటున్నారు. సమస్య పరిష్కారానికి జైపాల్ రెడ్డి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో జరిపిన ఇష్టాగోష్టి చర్చలు ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని పట్టుపడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు వెళ్లాలంటే తాను ఆలోచించాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, రాజీనామా చేయనందుకు తనను స్వార్థపరుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దాకా రావడానికి అధిష్టానమే కారణమని, అధిష్టానం సమస్య పరిష్కారానికి ఏం చేస్తోందో కేబినెట్ మంత్రినైన తనకు కూడా తెలియడం లేదని, గతంలో ఓ స్పష్టత ఉండేదని, ఇప్పుడు ఆ స్పష్టత లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+