చిదంబరం వెనుక ముఖ్యమంత్రి: నాగం జనార్దన్ రెడ్డి

ఢిల్లీలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చాక తమ రాజీనామాలు ఆమోదింప జేసుకొని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధుల నియోజకవర్గాల్లో పర్యటిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అందరూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ టిడిపి నేతలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. కాంగ్రెసు నేతలు రాజీనామా చేసిన తర్వాత రాజీనామాలు చేస్తామని టిడిపి నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు.












Click it and Unblock the Notifications