కాంగ్రెసు విప్ జారీ, తెలంగాణ ఎంపిలకు పరీక్ష

లోక్‌పాల్ బిల్లు సభలోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు విప్ జారీ చేసింది. ఈ బిల్లును సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ అన్నా హజారే బృందం ప్రతిపక్షాల నాయకులను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు విప్‌ను పాటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కాపాడడానికి తాము ముందుంటామని, ప్రభుత్వం మనుగడ సాగిస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని ఓ తెలంగాణ పార్లమెంటు సభ్యుడు ఇటీవల అన్నారు.












Click it and Unblock the Notifications