పెళ్లయిన అరగంటకే తాళి తెంపి పరారైన వరుడు

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తున్న జయలక్ష్మిని పక్కనే ఉన్న బట్టల షాపులో పనిచేస్తున్న వెంకటేష్ ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని అతను జయలక్ష్మిపై గత వారం రోజులుగా ఒత్తిడి తెస్తూ వస్తున్నాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పిన జయలక్ష్మి మాటలను అతను పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని బ్లేడుతో కోసుకోవడం వంటి చర్యలకు పూనుకున్నాడు. దీంతో ఆమె ద్వరకా తిరుమలలో పెళ్లికి అంగీకరించింది. పెళ్లి తర్వాత వెంకటేష్ పారిపోవడంతో ఇంటికి వచ్చిన జయలక్ష్మి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.












Click it and Unblock the Notifications