చంద్రబాబు ప్రకటనను బట్టి తెలంగాణ ఇవ్వాలి: పొన్నం

రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులు విధులకు, పార్లమెంటు సభ్యులు పార్లమెంటుకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై నిర్ణయం వెలువడిన తర్వాతనే శాసనసభ్యులు తిరిగి రాజీనామా చేసే విషయంపై ఆలోచన చేస్తామని శానససభ్యుడు రాజయ్య చెప్పారు. ఎవరో చెప్తే తాము రాజీనామాలు చేయబోమని, తమ కార్యాచరణ తమకు ఉందని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలంగాణ వ్యతిరేకి అని, రోశయ్య వల్లనే 2009 డిసెంబర్‌లో అసెంబ్లీ తీర్మానం ఆగిపోయిందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రోశయ్య మాట వినాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
సోనియా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ రేపు, ఎల్లుండి ప్రార్థనలు చేయాలని తెలంగాణ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు బ్రోకర్‌గా అభివర్ణించడాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం తప్పు పట్టారు. కెటిఆర్ పిల్ల చేష్టలు మానుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 9వ తేదీని అమరవీరుల దినంగా పరిగణించాలని కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications