హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తమోడిన ఆంధ్రప్రదేశ్: ప్రమాదాల్లో 11 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor District
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులు ఆదివారం రక్తమోడాయి. వేరు వేరు ప్రమాదాల్లో సుమారు పదకొండు మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో మన రాష్ట్రంలోని వారితో పాటు ఇతర రాష్ట్రానికి చెందిన వారూ ఉన్నారు. తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీకాళహస్తికి వెళుతుండగా మార్గమధ్యంలో సీతారాంపేట వద్ద జరిగిన ప్రమాదం కారణంగా ఐదుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా చెన్నైలోని ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో లారీ, ఆటోలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలోని చేబ్రోలు వద్ద చోటు చేసుకుంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారు ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు వాసులుగా తెలుస్తోంది.

నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శోభనాద్రిగూడెంలో ఓ ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇందులో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. కాగా హైదరాబాదులోని టోలీచౌకి వద్ద ఉదయం ఓ బైకును లారీ గుద్దు కోవడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు లారీకి నిప్పంటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

English summary
Eleven people dead in Andhra Pradesh in different accidents today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X