వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్ మండే: సెన్సెక్స్ పతనం, క్షీణిస్తున్న ఐటి షేర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Stock Exchange
ముంబై‌: అమెరికా దెబ్బకు ఆసియన్ స్టాక్ మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ ఒకానొక సందర్భంలో 17వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా గ్రేడింగ్ తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బ్లాక్ మండేగా అభివర్ణిస్తున్నారు.

ఐటి, టెక్నాలజీ షేర్లు క్షీణిస్తున్నాయి. బ్లూ చిప్ షేర్లు 3 నుంచి 5 శాతం పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం నివారణకు అమెరికా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చునని అంటున్నారు. భారత మార్కెట్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. షేర్లు కొనుగోలు చేయాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

English summary
Asian markets are experiencing USA down trading. Indian stock markets are loosing. Trading in asian markets are experiencing black monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X