వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరి తీయాల్సిందే: బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ‌: బూటకపు ఎన్‌కౌంటర్లకపై సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడిన పోలీసు అధికారులకు మరణ శిక్ష విధించి, వారిని ఉరి తీయాల్సిందేనని వ్యాఖ్యానించింది. గ్యాంగ్‌స్టర్ దారాసింగ్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్య చేసింది. న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, ప్రజలకు రక్షణ కల్పించకుండా కాంట్రాక్ట్ కిల్లర్లుగా మారి ప్రజలను చంపడం నేరమని జస్టిస్ సికె ప్రసాద్, మార్కండేయ కాజూలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అన్నది. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడడమంటే అత్యంత కిరాతకంగా హత్య చేయడమేనని అభిప్రాయపడింది.

2006 అక్టోబర్ 23వ తేదీన గ్యాంగ్‌స్టర్ దారాసింగ్‌ను కాల్చి చంపిన కేసులో రాజస్థాన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యులైన డిజిపి (అదనపు) అరవింద్ జైన్, ఎస్పీ అర్షద్ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోని పక్షంలో వారిని అరెస్టు చేసి, వారిపై సిబిఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మాజీ మంత్రి రాజేందర్ రాథోడ్ తప్పించుకుని తిరుగుతున్నాడని దారాసింగ్ భార్య సుశీలా దేవి కోర్టుకు విన్నవించుకుంది. విధులకు భిన్నమైన చర్యకు దిగే పోలీసు అధికారులకు సామాన్యులకు విధించే శిక్ష కన్నా కఠినమైన శిక్ష విధించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

English summary
Calling fake encounter killings as nothing but 'cold blooded brutal murder', the Supreme Court said police personnel involved in such incidents should be awarded death sentence and hanged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X