స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై మిస్సింగ్ కేసు: నాగం

మొదటిసారి రాజీనామాలు చేసినప్పుడు తాము స్పీకర్‌ను కలిస్తే ముఖాముఖి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా రాజీనామాలను భావోద్వేగం కారణం చెప్పి తిరస్కరించి విదేశాలకు వెళ్లిపోయారని, మళ్లీ రాజీనామాలు సమర్పించినా ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ తన కార్యాలయానికి కూడా రావడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ ఎప్పుడు వస్తారో, ఎక్కడున్నారో తెలియడం లేదని, తమ మెయిల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్రులకు అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని హరీశ్వర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications