హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్మాపై ఉలుకెందుకు?: తెలంగాణ టిడిపి నేత రివర్స్ గేర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు సకల జన సమ్మెపై సంచలన కామెంట్లు చేశారు. సకల జన సమ్మె సందర్భంగా ఎస్మా ప్రయోగిస్తే కొందరు ఉద్యోగులకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్నామని చెబుతున్న కొందరు ఉద్యోగులు ఎస్మా ప్రయోగాన్ని ప్రశ్నించడమేమిటని అడిగారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలలో పని చేసే వారికి కొందరికి పదవీ కాంక్ష ఉందని ఆరోపించారు.

రాజ్యసభ, మండలి ఆశలో ఉన్నారనే ప్రచారం జరుగుతోందని అది బాధాకరం అని అన్నారు. ఉద్యమం అంటే కేవలం తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకోవడమా అని ప్రశ్నించారు. తనకు పిఏసి చైర్మన్ పదవి కావాలని అసమ్మతి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి తన ముందే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అడిగారని అన్నారు. అది రాక పోవడం వల్లనే టిడిపిని ప్రశ్నిస్తున్నారని అన్నారు. సెటిలర్లపై దాడులకు దిగుతామని చెప్పడం ద్వారా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఉద్యమాన్ని వెనక్కి తీసుకు వెళుతున్నారా అని ప్రశ్నించారు.

English summary
TDP senior MLA Kottakota Dayakar Reddy take reverse gear on Telangana Employees Sakala Jana Same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X