వైయస్ జగన్‌ను వదలిపెట్టని టిడిపి, కాంగ్రెసు నేతలు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా జగన్ సిబిఐ విచారణకు అంగీకరించి నిజాయితీని నిరూపించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జగన్‌పై చాలా కాలంగా వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసు సందర్భంలో జగన్‌పై కక్ష కట్టే వైయస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణ జరిపించారా అని ఆయన సోమవారం అడిగారు. దమ్ముంటే తన ఆస్తులపై విచారణ చేయించుకోవాలని సవాల్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు.
తెలంగాణ నాయకులు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ వంటి నాయకులు కూడా జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్‌పై ఎడతెరిపి లేని విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రతి రోజూ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వైయస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆ మధ్య జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications