వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం వాదనలపై ధ్వజమెత్తిన నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy and DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు, కంపెనీలపై జరుగుతున్న దాడులు కక్ష సాధింపు చర్యలు అంటున్న జగన్ వర్గం నేతల వాదనలను మంత్రులు ఖండిస్తున్నారు. జగన్‌పై సిబిఐ దాడులు కక్ష సాధింపు చర్యలు కావని, అవసరమైన పక్షంలో కాంగ్రెసు సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌ను సైతం విచారించే అవకాశం ఉందని అనంతపురం జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ కంపెనీలపై సిబిఐ దాడుల్లో కాంగ్రెసు హస్తం ఉందో లేదో కూడా విచారణలో తేలుతుందన్నారు. మంత్రివర్గాన్ని విచారిస్తే తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అక్రమాలను కప్పి పుచ్చుకొని తప్పించుకునే ఉద్దేశ్యంలో భాగంగానే వైయస్సార్సీ పార్టీ నేతలు మంత్రివర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు గనులు లీజు జరిగిందన్నారు. జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే సుప్రీం కోర్టుకు వెళ్లవద్దని సూచించారు.

జగన్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని మంత్రి శంకర్ రావు డిమాండ్ చేశారు. జగన్ సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసినా ఫలితం ఉండదని అన్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన అందరిపైనా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనను జోకర్ అన్న వారు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఎమ్మార్‌లో ఫ్లాట్లు కొన్న వారి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన సచ్ఛీలత నిరూపించుకోవాలని మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. కక్ష కట్టే చరిత్ర కాంగ్రెసుకు లేదని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.

రాజకీయ లబ్ధి కోసం వైయస్సార్సీ పార్టీ నేతలు రోడ్లపై బరితెగించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళి అన్నారు. అవినీతి అంతమొందించడానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజా, కనిమొళి, సురేష్ కల్మాడి తదితరులపై అవినీతి అభియోగాలు వచ్చినప్పుడు వారిపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెసు ఉద్దేశ్య పూర్వకంగా ఎవరినీ వేధించడం లేదన్నారు. శంకర్ రావు కేసు వ్యక్తిగతం అన్నారు. తన పైనే విచారణ చేయించుకోమని లోకాయుక్తకు శంకర్ రావు లేఖ రాశారన్నారు. వైయస్‌పై మాకు గౌరవం ఉందన్నారు. సిబిఐ దర్యాఫ్తు ఆలస్యం కావడం వల్ల అక్రమార్కులు తమ జాగ్రత్తలు తాము తీసుకొని ఉంటారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. జగన్‌తో పాటు వైయస్ మంత్రివర్గం, కేంద్ర మంత్రి అహ్మద్ పటేల్‌ను విచారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ తన ఆస్తుల వివరాలు బయట పెట్టాలన్నారు.

English summary
Congress party leaders condemned YSRC party leaders comments on CbI probe on MP YS Jaganmohan Reddy. TDP MLA Payyavula Keshav demanded for ministers enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X