తప్పులన్నీ చేసి వైయస్ జగన్ దేవుడంటున్నాడు: విహెచ్

V Hanumanth Rao
హైదరాబాద్: తప్పులన్నీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇప్పుడు దేవుడున్నాడని అంటున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీ అధిష్టాన వర్గానికి ముడుపులు చెల్లించినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. వైయస్సార్‌కు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు ఫోన్లు చేశారని జగన్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. అధిష్టానం పెద్దలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ వ్యవహారాలపై, ప్రభుత్వ పథకాలపై మాట్లాడడం పరిపాటి అని, అందులో భాగంగానే అహ్మద్ పటేల్ మాట్లాడి ఉంటారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తాను చేసిన తప్పుల్లో కాంగ్రెసు అధిష్టానాన్ని ఇరికిస్తే బయటపడవచ్చునని జగన్ భావిస్తున్నట్లున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు కుట్ర చేస్తోందని అనడం ద్వారా సానుభూతి పొందాలని జగన్ వర్గం అనుకుంటోందని ఆయన అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తులో కాంగ్రెసు పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీది కుట్రలు చేసే సంస్కృతి కాదని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలే ఉన్నాయని దమ్ముంటే సిబిఐతో విచారణ చేయించుకోవచ్చునని గతంలో వైయస్ జగన్ వర్గం నాయకులు సవాల్ చేశారని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ మంత్రివర్గంలోని సభ్యులందరిపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన డిమాండ్‌ను ప్రస్తావిస్తూ శాసనసభ్యుడు కాక ముందు బాలినేని ఆస్తులెన్నో తనకు తెలుసునని, అందరి చరిత్ర తన వద్ద ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+