అన్నా హజారేకు ప్రధాని లేఖ, దీక్ష విరమణకు విజ్ఞప్తి

Manmohan Singh
న్యూఢిల్లీ: దీక్ష విరమించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సామాజిక కార్యకర్త అన్నా హజారేకు విజ్ఞప్తి చేశారు. లోక్‌పాల్ బిల్లుపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నా బృందంతో చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నా హజారేకు ఓ లేఖ రాశారు.

ప్రభుత్వానికి, అన్నా బృందం మొదటిసారి ముఖాముఖి భేటీ అయ్యాయి. న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్జీద్ మంగళవారం అర్వింద్ కేజ్రివాల్‌తో సమావేశమయ్యారు. లోక్‌పాల్ సమస్యపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సమస్య ప్రారంభమైన ఆగస్టు 16వ తేదీ తర్వాత ఇరు పక్షాలకు మధ్య ఇదే తొలి సమావేశం. ఈ సమావేశం ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ నివాసంలో జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+