టిటిడి చైర్మన్ పదవికి రేసులో లేను: అల్లు అరవింద్

Allu Aravind
హైదరాబాద్: టిటిడి చైర్మన్ పదవికి తాను రేసులో లేనని చిత్ర నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ స్పష్టం చేశారు. టిటిడి చైర్మన్‌గా అల్లు అరవింద్‌ను నియమించాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియా కథనాలు చూసి తాను ఆశ్చర్యపోయానని అల్లు అరవింద్ అన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన గురువారంనాడు అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ పదవిని తన బావ మరిది అల్లు అరవింద్‌కు ఇప్పించేందుకు కాంగ్రెసు పార్టీ కొత్త కాపు చిరంజీవి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో పాలక మండలినో, స్పెసిఫైడ్ అథారిటీనో నియమించాల్సి ఉంటుంది. దీంతో పాలక మండలి చైర్మన్‌గా అల్లు అరవింద్‌ను నియమింపజేసేందుకు చిరంజీవి నడుం కట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి శాసనసభ్యుడిగా తనకు ఆ అవకాశం ఇవ్వాలనేది కూడా చిరంజీవి వాదనగా కనిపిస్తోంది.

ఆ విషయంపై చిరంజీవి ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన కూడా ఆ విషయం వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి ఫోన్ చేయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+