ఆచార్య కెవిపి రామచందర్ రావును ఇరికిస్తున్నారా?

బిపి ఆచార్య ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భారీ భూకేటాయింపులు జరిగాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో బినామీల పేర్ల మీద విల్లా కేటాయింపులు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా తెలిపింది. దాదాపు 18 విల్లాలు అప్పటి ప్రభుత్వ పెద్దకు కేటాయించినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఏ అధికారి అయినా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని, తాను కూడా అదే పనిచేశానని ఆచార్య సిబిఐ అధికారులతో చెప్పినట్లు ఆ దినపత్రిక రాసింది. కెవిపి రామచందర్ రావు ఆదేశాల మేరకే తాను ఎమ్మార్ ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆచార్య చెప్పినట్లు తెలుస్తోంది. కెవిపి బావ మరిది పార్థసారథికి అర్హత లేకుపోయినా తనతో పాటు డైరెక్టర్ పదవి కట్టబెట్టారని, దానికి కెవిపి ఒత్తిడే కారణమని ఆచార్య చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications