లగడపాటి శ్రీధర్‌నూ విచారించాలి: పొన్నం ప్రభాకర్

తెలంగాణ అంశంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఓ లేఖ రాశారు. తెలంగాణపై రెండు నెలల్లోగా చర్చలు పూర్తి చేయాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి కోసం 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే తెలంగాణ కోసం మీరెందుకు రాజీనామాలు చేయడం లేదని ప్రజలు తమను నిలదీస్తున్నారని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల రాజీనామాల నేపథ్యంలో తమపై ఒత్తిడి పెరిగిందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ లోగా తమ రాజీనామాలను ఆమోదించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సోనియాపై గౌరవంతో ఇన్నాళ్లు తాము ఆందోళనలు, ఉద్యమాలు చేయడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల్లో చీలిక వచ్చిందనే వార్తలను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications