వైయస్ జగన్ పార్టీకి మాజీ సిఎం రోశయ్యనే కారణమా?

అదే సమయంలో వైయస్ జగన్ విషయంలో రోశయ్య తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరైన విధంగా వ్యవహరించి ఉంటే సమస్య వచ్చేది కాదని అంటున్నారు. జగన్ ఓదార్పు యాత్రను కొనసాగినిచ్చి ఉంటే పరిస్థితి చేయి దాటి పోయేది కాదని, రోశయ్య వల్లనే ఓదార్పు యాత్రపై అధిష్టానం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అలాగే, వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో, నాయకులతో రోశయ్య సరిగా మాట్లాడలేదని, వారిని దూరం పెడుతూ వచ్చారని, దీంతో జగన్ వర్గంలో ఓ విధమైన అసంతృప్తి ఏర్పడిందని, ఇవ్వన్నీ కలిసి వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టారని అంటున్నారు. ఏమైనా, పెద్దాయన రోశయ్యను సమస్యలు వీడడం లేదు.












Click it and Unblock the Notifications