జగన్‌ను ప్రశ్నించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

అక్రమ నిధులను మళ్లించేందుకు ఉపయోగించిన రెండు మారిషస్ కంపెనీల పాత్రపైనా ఈడీయే విచారణ జరపాల్సి ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌తోపాటు విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలను కూడా పరిశీలించాలని ఈడీకి సీబీఐ లేఖ రాయనున్నట్లు తెలిసింది. కోల్‌కతా కేంద్రంగా ఉన్న బోగస్ కంపెనీల వ్యవహారంపై జగన్‌ను ఈడీ ప్రశ్నించనుందని, అది ఢిల్లీలోనే జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు మరో రెండు వారాలు పట్టవచ్చునంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేస్తే కనీసం ఆరు నెలలపాటు జైలులో ఉండాల్సి వస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications