చంద్రబాబు ట్రాప్‌లో కాంగ్రెసు, కిరణ్ కుమార్ చేయూత?

ఇటీవల స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కాంగ్రెసు, తెలుగుదేశఁ పార్టీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయని, అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని సాక్షి పత్రిక రాసింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంలో ఇరుక్కుపోయి చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయామా అనే అనుమానాలు కాంగ్రెసు నాయకుల్లో బయలుదేరినట్లు రాసింది. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో రాజకీయంగా కలకలం సృష్టించి, కాంగ్రెసులో మరింత అస్థిరతను సృష్టించి, మరింత మంది శాసనసభ్యులను తన వైపు లాక్కునే జగన్ వ్యూహంలో భాగంగానే ఈ వార్తాకథనం వచ్చి ఉంటుందని కాంగ్రెసులోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.












Click it and Unblock the Notifications